Header Banner

ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ సోదాలు! కీలక పత్రాలు స్వాధీనం! వేలకోట్ల అవినీతి గుట్టురట్టు!

  Sun Apr 27, 2025 09:20        Others

కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్‌ కి ఏసీబీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌ లోని షేక్‌పేట ఆదిత్య టవర్స్‌లోని ఆయన నివాసంలో.. తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది. ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ మెరుపు సోదాలు చేపట్టినట్టు సమాచారం. హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల రెయిడ్స్ కొనసాగుతోన్నాయి. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఏసీబీ సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ప్రస్తుతం హరిరామ్‌ కాళేశ్వరం కార్పొరేషన్‌ ఎండీగా, గజ్వేల్‌ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తున్నారు. గతంలో కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు.


ఇది కూడా చదవండి: మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై గతేడాది సెప్టెంబర్ 27న జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ హరిరామ్‌ను విచారించింది. ఆయనకు 90కి పైగా ప్రశ్నలను సంధించగా, కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై సైతం కమిషన్ ఆరా తీసింది. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు వరకు తిరిగి చెల్లించినట్లుగా ఆయన విచారణలో తెలిపారు. అంతే కాకుండా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో రూ.64 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించామని పేర్కొన్నారు. ఇక కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. ఇక హరిరామ్‌ భార్య అనిత సైతం నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హెచ్-1బీ ఆశావహులకు అమెరికా షాక్! ఇకనుండి అవి తప్పనిసరి!

 

కేంద్ర నిఘా సంస్థ పేరుతో వదంతులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ

 

పోలవరంపై రీసర్వే నిర్వహించాలి.. షర్మిల కీలక వ్యాఖ్యలు!

 

గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు..

 

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #kaleshwaram #hariram #acbraids #telangananews #corruption